- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వందే భారత్ రైలు ప్రయాణికుడికి గుండెపోటు..
by Sumithra |
X
దిశ, మిర్యాలగూడ : వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురవగా, అత్యవసర పరిస్థితుల్లో ట్రైన్ ను శుక్రవారం రాత్రి మిర్యాలగూడ రైల్వేస్టేషన్ లో నిలిపారు. వివరాలు పరిశీలిస్తే సికింద్రాబాద్ మీర్పేట్ కు చెందిన ప్రభాకర్ (72) అనే వ్యక్తి తన మనవరాలు పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో తిరుపతికి బయలుదేరాడు. నల్లగొండ దాటిన తర్వాత గుండె నొప్పివస్తుందని తెలుపగా మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో అత్యవసరంగా ట్రైన్ ను నిలిపివేశారు. అప్పటికే ట్రైన్ లో పలువురు ప్రయాణికులు ప్రభాకర్ కి సీపీఆర్ చేసి హుటాహుటిన అంబులెన్స్ లో పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Advertisement
Next Story