- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగర్‌లో బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. ఒకేసారి 19 మంది సిట్టింగ్ నాయకులు జంప్
దిశ, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆయా రాజకీయ పార్టీలు వారి బలాన్ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సాగర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించి భారీ చేరికలపై ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్, ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ బిగ్ ప్లాన్ వేసింది. బీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జపింగ్‌లా కార్యక్రమాలు ఉపందుకున్నాయి. ప్రధానంగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ బాట పట్టడంతో.. మిగతా నాయకులు కూడా హస్తంతో దోస్తీ కట్టేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ క్రమంలోనే ఈ రోజు ఏకంగా 19 మంది సిట్టింగ్ స్థానాల్లో గెలిచిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అందులో గుర్రంపొడు మండలానికి చెందిన ఒక జడ్పీటీసీ, నలుగురు ఎంపీటీసీలు, 14 మంది సర్పంచులు వందలాది మంది కార్యకర్తలు కుందూరు జానారెడ్డి సమక్షంలో చేరేందుకు సిద్ధమయ్యారు.
కారులో ఇమడలేక !!
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు సమాచారం ఉంది. ఏ రోజు కార్యకర్తలను లెక్కచేయక పోవడం, పార్టీ కార్యక్రమాలలో సైతం తన కుటుంబానిదే పెత్తనం ఉండటంతో పార్టీ కోసం కష్టపడిన నేతలు కారులో ఇమడలేక పోతున్నారనేది బీఆర్ఎస్ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ, ఏ ఒక్క పనులు చేసుకోలేకపోతున్నామని పలువురు ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు.