protest : మహిళల అకౌంట్లో నుంచి రెండు కోట్ల రూపాయలు మాయం..ఏం జరిగిదంటే..?

by Naveena |
protest : మహిళల అకౌంట్లో నుంచి రెండు కోట్ల రూపాయలు మాయం..ఏం జరిగిదంటే..?
X

దిశ,రామన్నపేట : భువనగిరి చిట్యాల ప్రధాన రోడ్డుపై మహిళా సంఘాల సభ్యులు నిరసనకు దిగారు. మహిళా సంఘాలను మోసం చేసి కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన విబీకే పై చర్యలు తీసుకొని,కాజేసిన డబ్బులను తమకు ఇప్పించాలంటూ మహిళల సంఘాల సభ్యులు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన కాటేపల్లి లింగస్వామి గ్రామ విబికేగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలో సుమారు 58 మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాల సభ్యులకు లోన్ ల పేరిట వారికి మంజూరైన డబ్బులను వారికి తెలువకుండానే విత్ డ్రా చేసుకున్నాడు. పక్కా పథకం ప్రకారం వోచర్ల సంతకాలు పెట్టించుకుని బ్యాంక్ అధికారులను మ్యనేస్ చేసుకొని ఆయన సొంత అకౌంట్లోకి బంధువుల బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. దాదాపు రెండు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని మహిళల సంఘాల సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు దూరప్రాంతాల వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఎంపీడీవో,ఎస్బిఐ బ్యాంకు వద్ద ధర్నా

రాస్తారోకో నిర్వహించిన అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి..ఎంపీడీవో భూక్య యాకూబ్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలపై తక్షణమే విచారణ చేపట్టి అవినీతి చేసిన వారిపై క్రిమినల్ కేసు పెడతానని, ప్రతి పైసాను రికవరీ చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింప చేశారు. తాము లేకుండా తమ అకౌంట్ నుంచి విబికే అకౌంట్ కు డబ్బులు ఎలా ట్రాన్స్ ఫర్ చేస్తారని ఎస్బిఐ బ్యాంకు వద్ద ఆందోళన నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed