- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నా భర్త ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలి
దిశ,తుంగతుర్తి : తన భర్త ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన తాడూరి అనితతో పాటు బంధువులు గురువారం హైదరాబాద్ లోని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మృతుని భార్య అనిత మాట్లాడుతూ తన భర్త తాడూరి కృష్ణ మరణించి 20 రోజులైనా నిందితులపై చర్యలు లేవన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తన భర్త కృష్ణపై గ్రామానికి చెందిన కొంతమంది పెద్ద మనుషులు కుమ్మక్కై అక్రమంగా కేసులు మోపడంతో అవమాన భారంతో అక్టోబర్ 16న ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణమైన పెద్ద మనుషుల పేర్లు కాగితంపై రాసి తన భర్త జేబులో పెట్టుకున్నాడని వివరించారు. దీనిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని తెలిపారు. సంఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఆత్మహత్యకు కారకులైన పెద్దమనుషులపై చర్యలు తీసుకోలేదని అన్నారు. జిల్లా అధికారులకు కూడా ఈ విషయం వివరించినట్లు తెలిపారు.పెద్దమనుషులతో తమ కుటుంబానికి ప్రాణహాణి ఉందని అనిత తన భర్త ఫొటోతో ఏడుస్తూ ఫిర్యాదు చేసింది.