- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
జనగామలో దొంగల బీభత్సం.. భారీగా బంగారం చోరీ!
![జనగామలో దొంగల బీభత్సం.. భారీగా బంగారం చోరీ! జనగామలో దొంగల బీభత్సం.. భారీగా బంగారం చోరీ!](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348104-1.webp)
దిశ, జనగామ: గ్రామం, పట్టణాలతో సంబంధం లేకుండా రోజురోజుకు దొంగల అరాచకాలు పెరిగిపోతున్నాయి. దొంగలపై పోలీసులు నిఘా పెట్టినప్పటికీ దొంగలు భయం భీతి లేకుండా మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటూ రెచ్చిపోతున్నారు. రెండ్రోజుల క్రితమే రెండ్రోజుల క్రితమే వికారాబాద్ జిల్లాలో పరిగిలోని ఫీచర్స్ కాలనీలో ఓ కాలేజీ లెక్చరర్ ఇంట్లో ఏకంగా 15 తులాల బంగారం, 2 కిలోల వెండి, లక్ష ఇరవై ఐదు వేల నగదు చోరీ అయిన విషయం తెలిసిందే. తాజాగా జనగామ జిల్లా కేద్రంలోని బీరప్పగడ్డ ప్రాంతంలోని బీరప్పగుడి వెనుకాల ఇంటిలో దొంగతనం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గుంటి ప్రేమలత తన ఆరోగ్యరిత్యా హైదదాబాద్లో ఓ హాస్పిటల్లో చూపించుకుందామని వెళ్లింది. ఉదయం వారి కుటుంబ సభ్యులకు చెప్పిన సమాచారం మేరకు వచ్చి చూడగా 11 తులాల 4 గ్రాముల బంగారం, 20 తులాల వెండి 15వేల నగదు పోయిందని తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. రాత్రి 1 గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. క్లుస్ టీం పిలిపించి కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని జనగామ ఎస్ఐ భారత్ తెలిపారు.