ప్రభాస్ పెళ్లిపై హింట్ ఇచ్చిన శ్యామలా దేవి.. జరిగేది అప్పడేనంటూ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |
ప్రభాస్ పెళ్లిపై హింట్ ఇచ్చిన శ్యామలా దేవి.. జరిగేది అప్పడేనంటూ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ చరిత్ర సృష్టిస్తున్నాడు. అంతేకాకుండా కలెక్షన్ల పరంగానూ బాక్సాఫీసు వద్ద రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇటీవల డార్లింగ్ కల్కి మూవీతో సూపర్ హిట్ అందుకుని థియేటర్స్‌లో దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్‌తో పాటు రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. అయితే గత కొద్ది కాలంగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. 40 ఏళ్లు దాటినప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో జనాలంతా ఆ వేడుక కోసం కుటుంబం, ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చింది. ‘‘బాహుబలి తర్వాత ప్రభాస్ విజయాలు దక్కవని పలువురు అన్నారు. కానీ కల్కి తర్వాత అతని స్థాయి ఏంటో అందరికీ అర్థం అయింది. సినిమాలు ప్రేక్షకులకు నచ్చేలా చేయాలని చాలా కష్టపడుతున్నాడు. అలాగే మేము కూడా ప్రభాస్‌కు పెళ్లి చేయాలని చూస్తున్నాము. మా కూడా అతను ఓ ఇంటివాడు కావాలని ఉంటుంది కానీ సమయం రావాలి కదా. ఆ నమ్మకంతోనే తొందరలో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఎదురు చూస్తున్నాము. కృష్ణం రాజు గారు అన్ని పై నుండి చూస్తుంటారు. ప్రభాస్ జీవితంలో అన్ని ఆయన ఊహించినట్లుగానే జరిగాయి. కాబట్టి పెళ్లి కూడా జరుగుతుంది. అయినా మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ప్రభాస్‌ను చూస్తేనే అర్థం అవుతుంది. అలాగే మంచి వారికి అంతా మంచే జరుగుతుంది’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed