శని దేవుడి అనుగ్రహం.. అదృష్టం మొత్తం ఆ రాశుల వారిదే

by Prasanna |
శని దేవుడి అనుగ్రహం.. అదృష్టం మొత్తం ఆ రాశుల వారిదే
X

దిశ, ఫీచర్స్: జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే కర్మలను బట్టి మంచి, చెడు ఇస్తుంటాడు. మంచి చేస్తే మంచి వస్తుంది.. చెడు చేస్తే రెట్టింపు చెడు ఇచ్చే బాధ్యత శని దేవుడు తీసుకుంటాడు. కాబట్టి, సాధ్యమైనంత వరకు మంచి కర్మలను చేస్తూ ఉండాలి. శని దేవుడు జూన్ 2 నుంచి కుంభ రాశిలో వక్ర గమనంలో ప్రయాణిస్తున్నాడు. దీని వలన కొందరికి అనుకూలంగా ఉండనుంది. శని దేవుడు ప్రస్తుతం తన మూలత్రికోణ రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ కారణంగా మరో 5 నెలల పాటు రెండు రాశుల వారిపై శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కన్యా రాశి

శనిదేవుని తిరోగమన ప్రభావం వల్ల ఉద్యోగికి పదోన్నతి లభిస్తుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. పెద్దలతో మీ సంబంధం కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆఫీసులో పని చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి.

మేషరాశి

శని తిరోగమనం మేషరాశికి శుభప్రదంగా ఉండనుంది. చిరు వ్యాపారులకు వారానికి వచ్చే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పొదుపు చేసిన డబ్బు మీ సమస్యల నుంచి కాపాడుతుంది. మీరు కొనుగోలు చేసిన భూమి రేటు కోట్లకు పలుకుతుంది. దీని వలన మీ కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed