దీపికా పదుకొనేకి పుట్టబోయేది అమ్మాయా.. అబ్బాయా.. జ్యోతిష్యులు ఏం చెప్పారంటే?

by Kavitha |
దీపికా పదుకొనేకి పుట్టబోయేది అమ్మాయా.. అబ్బాయా.. జ్యోతిష్యులు ఏం చెప్పారంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్‌డమ్ తెచ్చుకుంది. ఇటీవల ‘కల్కీ 2898 ఏడీ’ మూవీలో ప్రభాస్ సరసన నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అయితే త్వరలో మరో జీవితంలో అడుగుపెట్టనుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత చాలా సంవత్సరాలకు తాను తల్లి కాబోతున్నాననే శుభవార్తను ఫిబ్రవరిలో అభిమానులతో పంచుకున్న దీపిక సెప్టెంబర్ నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న దీపికా ఇటీవల కల్కి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బయటకు రావడంతో ఈమె బేబీ బంప్‌కి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఈమెకు పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అనే విషయం గురించి అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ జగన్నాథ్ గురూజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీపికా పదుకొనే రణవీర్ సింగ్ జాతకాలను బట్టి చూస్తే వీరికి కలిగే మొదటి సంతానం అబ్బాయి అంటూ ఆయన తెలియజేశారు. ఇక ఈ అబ్బాయి వీరి జీవితంలో ఒక యువరాజుల పెరగబోతున్నారని ఈ యువరాజు కారణంగా తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని జగన్నాథ్ గురూజీ వెల్లడించారు. ఇక ఈ దంపతులకు మగ బిడ్డ పుట్టడం వల్ల వీరికి మరింత అదృష్టం కలిసి వస్తుందని ఆయన తెలిపారు. మొత్తానికి దీపికకు అబ్బాయి పుట్టబోతున్నారనే విషయం తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన జాతకం ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed