Ap News: ఉద్యోగం కోసం వెళ్తూ యువకుడు మృతి

by srinivas |   ( Updated:2024-07-07 08:34:20.0  )
Ap News: ఉద్యోగం కోసం వెళ్తూ యువకుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వోల్వో బస్సు ఢీకొట్టింది. కొమ్మలపూడి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు గూడూరు బాలాజీ నగర్‌కు చెందిన మనుబోలు సురేష్ రెడ్డి(45)గా గుర్తించారు. ఉద్యోగం కోసం తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి కృష్ణపట్నం పోర్టుకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సురేష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా స్నేహితుడు ప్రశాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed