- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది : మంత్రి జగదీశ్ రెడ్డి
దిశ, నకిరేకల్ : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆకర్షితులై దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.మోడీ మోసం బట్టబయలైందని, జాతీయత పేరుతో దేశద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నకిరేకల్ మండలం చందుపట్ల ఎంపీటీసీ లక్ష్మీ వెంకన్న, కట్టంగూరు మండలం ఈదులూరు ఎంపీటీసీ భవాని, చందంపల్లి ఎంపీటీసీ కిషోర్, నోముల ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తోపాటుగా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి జగదీష్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ తో పాటు రైతాంగానికి అందిస్తున్న రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలను దేశమంతా కోరుతుందన్నారు. కేవలం మోడీ సంపన్నులకు మాత్రమే ఆదాయాన్ని దోచి పెట్టాడని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఢిల్లీ గడ్డపై జెండా ఎగరవేస్తుందని జోష్యం చెప్పారు. అదేవిధంగా ఎల్లవేళలా నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్న లింగయ్యకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ కు అండగా ఉండాలని కోరారు. విపక్షాలు జీర్ణించుకోలేక అభివృద్ధిపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు సమూలంగా ఉందన్నారు. విమర్శలు తప్ప అభివృద్ధిని జీర్ణించుకోలేని స్థాయిలో విపక్షాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.