వర్షానికి కూలిన ఇంటి పై కప్పు..

by Sumithra |
వర్షానికి కూలిన ఇంటి పై కప్పు..
X

దిశ, మోత్కూరు : మండలంలోని పొడిచేడులో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంటి పై కప్పు పడిపోయింది. గ్రామానికి చెందిన నల్ల ధనంజయ రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో కూలిందని పై కప్పు కూలి పోయిన సమయంలో ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండడంతో ప్రాణాపాయం తప్పింది. నిరుపేద కుటుంబానికి చెందిన నల్ల ధనుంజయకు అధికారులు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలన్నారు.

Advertisement

Next Story