- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్టల్లో బియ్యం అమ్ముకున్న చరిత్ర కూసుకుంట్లది : రాజగోపాల్ రెడ్డి
దిశ, చండూరు: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం గట్టుప్పల్ మండలంలోని వెల్మకన్య, శేరిగుడం, తెరటపల్లి, నామాపురం, గట్టుప్పల్ గ్రామలల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. 1200 మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటే చలించిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని రాష్ట్రం వచ్చాక అప్పులు చేసి అందరి జీవితాలను కేసీఆర్ ఆగం చేసాడన్నారు. మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం వారి బాగు కోసం రాజీనామా చేసి కొట్లాడనాని అన్నారు. నాకు పదవులు ముఖ్యం కాదు నా ప్రాణం మునుగోడు ప్రజలు నా ప్రజల కోసం ఏదైనా చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే అయ్యేది ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పదవులు అనుభవించడానికి కాదన్నారు. పేద ప్రజలకు సహాయం చేసిన తృప్తి.. ఏ ఎమ్మెల్యే పదవిలో ఏ మంత్రి పదవిలో కూడా లేదన్నారు. మునుగోడులో ఏ మహిళను కదిలించిన ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేద మహిళల బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే చర్లగూడం, కిష్ట్రంపల్లి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. పేదలకు సాయం చేసే గుణం నాదైతే, హాస్టల్లో చిన్నపిల్లల బియ్యం, పప్పులు అమ్ముకున్న చరిత్ర కూసుకుంట్లది అన్నారు. ప్రజలకోసం నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. చెయ్యి గుర్తుపై ఓటువేసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా వివిధ గ్రామాలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పున్న కైలాష్ నేత, నారబోయిన రవి ముదిరాజ్ చలమల్ల వెంకట్ రెడ్డి, బాల లక్ష్మణ్, కంచుగుంట్ల దామోదర్ మల్లేష్ , కార్యకర్తలు పాల్గొన్నారు.