- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ - నిర్వాసితులకు అండగా ప్రభుత్వం.. దేవరకొండ ఎమ్మెల్యే
దిశ, డిండి : భూ - నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిండి మండలం వీరబోయినపల్లి కెనాల్ క్రింద ముంపునకు గురైన భూ-నిర్వాసితులకు 11మంది రైతులకు రూ.40లక్షల 891రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపునకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆయన తెలిపారు. ప్రతి ఎకరాకు సాగు, త్రాగు నీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యం అని ఆయన అన్నారు. డిండి, నక్కలగండి ప్రాజెక్టులు, 5లిఫ్టులు పూర్తి అయితే రాష్ట్రంలో ఎక్కువ రిజ్వాయర్లు గల నియోజకవర్గంగా అవుతుందని ఆయన తెలిపారు.
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం అని ఆయన అన్నారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉండాలని ఆయన అన్నారు. రైతు బంధు, రైతు భీమా దేశానికి ఆదర్శం అని అన్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్ రావు, డిండి మండల రైతు బంధు అధ్యక్షులు, డిండి మండల భీఆర్ఎస్ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్ రావు, ఎంపీటీసీ తిరుపతి, మాధవరం జనార్దన్ రావు, బొడ్డుపల్లి కృష్ణ, తహసీల్దార్ చంద్రశేఖర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.