- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోంది.. మాజీ ఎమ్మెల్యే
దిశ, నకిరేకల్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని నకిరేకల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అరాచక, దుర్మార్గ, నికృష్ట ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు రైతులను చిత్రహింసలు పెట్టిన ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు.
దళిత గిరిజన బలహీన రైతులను జైల్లో పెట్టి చిత్రహింసలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వబోమంటే కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. రైతుల పై థర్డ్ డిగ్రీ టార్చర్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎన్నో గొప్ప హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. పాలనను గమనిస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన బాగుండేదని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Nalgonda