- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నీ అక్కడే.. అసాంఘికానికి అడ్డాగా ఉదయ సముద్రం..
దిశ, నల్లగొండ క్రైం : నల్లగొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిత్యం వందల సంఖ్యలో ప్రేమికులు, జూదరులు, గంజాయి బ్యాచ్ అక్కడికి వస్తుంటారు. ప్రాజెక్ట్ పైనే మద్యం, సిగిరెట్లు తాగుతూ, ఆహ్లాదం కోసం కుటుంబంతో కలిసి వచ్చే వారికి, తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్నారు.
హెచ్చరిక బోర్డు.. తలుపులు ధ్వంసం..
ప్రాజెక్టు పై వచ్చి మద్యం సేవించినా, సిగిరెట్లు తాగినా, గేట్లపైకి ఎక్కినా చట్టరీత్యా కఠిన చర్యలకు తీసుకుంటామని హెచ్చరికతో రాసిన బోర్డును ఆకతాయిలు పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రాజెక్టు అధికారులు అక్కడ నిఘా ఉంచకపోవడంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చెరువు పూర్తిగా నిండాక డ్యాం సేఫ్టీకోసం నీటిని బయటకు పంపడానికి ఏర్పాటు చేసిన తలుపులపైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు. కాగా, ప్రాజెక్టు అధికారులు కానీ, సిబ్బందికి ఉండటానికి ఏర్పాట్లు చేసిన రెండు గదులు జల్సారాయుళ్లకు ఓ స్పాట్ గా మారాయి. వాటి తలుపులు పూర్తిగా ధ్వంసం కావడంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అందులోనే కొంతమంది యువకులు గంజాయి తాగుతున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. రాత్రి సమయంలో కొన్ని జంటలకు ఆ రెండు గదులు అడ్డాగా మారాయని తెలుస్తోంది. చందనపల్లిలో వైన్ షాప్ ఉండటంతో, అక్కడ మద్యం కొనుగోలు చేసి, ప్రాజెక్టు పై సేవిస్తున్నారని తెలుస్తోంది. పర్యాటకులు, మద్యం ప్రియులు ప్లాస్టిక్ బాటిల్స్, పాలిథిన్ కవర్లు వినియోగం అనంతరం నీటిలో పడేయడంతో నీరు పూర్తిగా కలుషితం అవుతోంది.
ప్రేమికులే టార్గెట్..
గతంలో ప్రేమికులను ప్రాజెక్టు ఆవరణలో ఉండే ఆకతాయిలు టార్గెట్ చేశారు. వారి వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడి డబ్బు, బంగారం దోపిడీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నల్లగొండ పోలీసులు, నిందితులను పట్టుకుని జైలుకు పంపించారు. కానీ, మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుందని, పోలీసుల నిఘా పెంచాలని పట్టణ వాసులు పేర్కొంటున్నారు.