- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఈటీ కోసం విద్యార్ధుల ధర్నా
దిశ, వలిగొండ: తమ పాఠశాలకు పీఈటీని నియమించాలని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం విద్యార్ధులు అర్రూర్ గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్ధులు స్కూల్ గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా స్కూల్ లో పీఈటీగా విధులు నిర్వర్తించే ఊపాధ్యాయురాలు డిప్యూటేషన్ పై హైదరాబాద్ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. చదువుతోపాటు శారీరక ధృడత్వం చాలా ముఖ్యమని కానీ, తమను ఆటలు ఆడించకపోవడం వలన శారీరక ధృడత్వం కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా నిరసన తెలిపి విద్యశాఖ మంత్రి, విద్యాశాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి దృష్టికి తమ సమస్య తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని వారు తెలిపారు.
ఈసారి సంబంధిత అధికారులు వచ్చి తమ సమస్య పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కార్యక్రమం ఆపే ప్రసక్తి లేదని విద్యార్ధులు భీష్మించుకుని కూర్చున్నారు. విద్యార్ధుల నిరసన కార్యక్రమానికి గ్రామస్తులు, సోషల్ సర్వీస్ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఇదిలావుండగా విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో పాఠశాల ఊపాధ్యాయులు ఏమీ చెయ్యలేక పక్కన కూర్చోవడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో చిలుక మరి విష్ణుమూర్తి, జింకల మల్లేశం, ఆవుల అంజయ్య, బండారు నర్సిరెడ్డి, మర్రి వెంకన్న, చిలుక మరి భాస్కర్, ఎలిమినేటి సంతోష్, ఏఐవైఎఫ్ సభ్యులుసుద్దాల సాయికుమార్, పోలే పాక రమేష్, చిలుక మరి నరసింహ, వేముల అనిల్, పాక మహేష్, మరి నరేష్, రచ్చ శివరాజ్, వల్లాల సతీష్, సుక్క శ్రీకాంత్, పోలేపాక శ్రీధర్, సునీల్, మధు, విద్యార్థినీవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.