- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Uttamkumar Reddy : నిర్దిష్ట గడువులోపు పనులు పూర్తిచేయకపోతే కఠిన చర్యలు
దిశ,కోదాడ:కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో వేసవి కాలం వరకు మొదలుపెట్టిన అభివృద్ది పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి( Minister Uttamkumar Reddy )అధికారులను హెచ్చరించారు. సోమవారం కోదాడ-హుజూర్ నగర్ అధికారులతో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ముత్యాల,జాన్ పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి కావాలని అధికారులను అన్నారు.శాంతినగర్ పద్మావతి ఎత్తిపోతల పథకం పై అసంతృప్తి వ్యక్తం చేసిన అనంతరం అధికారులపై మండిపడ్డారు.ఆర్ 9లిఫ్ట్ ఒక నీళ్ల పంపు టైట్ అవుతుందని తెలిపిన రైతు తెలుపగా, అధికారులతో చర్చించి త్వరగా పైపు పనులు పూర్తి కావాలని ఆదేశించారు.శ్రీరాంసాగర్ నీళ్లు మోతే, మునగాల,నడిగూడెం కు రావాలని రైతులు విన్నవించుకోవడంతో, నీళ్లు వచ్చే విధంగా అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా లిఫ్ట్ ఇరిగేషన్ లో కాంట్రాక్టర్ బేసిక్ లో పనిచేసిన వారిని తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లెఫ్ట్ కెనాల్, ఇరిగేషన్ అధికారులను త్వతరితగా పనులు పూర్తి కావాలని తెలిపారు. ఈఎత్తిపోతుల పథకం పూర్తి అయితే 5000 కొత్త ఆయకట్టు సేద్యంలోకి వస్తుందన్నారు. అదేవిధంగా తమ అధికారంలోకి వచ్చాక 46.65 కోట్లతో మంజూరు చెందిన రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులు వెంటనే జానపాడు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అందుకు సంబంధించిన పాలన పరమైన అనుమతులుపొందాలన్నారు.
వ్యవసాయ అధికారులను నాణ్యతమైన విత్తనాలు ఇవ్వాలని సూచించారు.కోదాడ, అనంతగిరి వైపునకు వెళ్లే రోడ్డు వెడల్పు చేయాలని అధికారులు ఆదేశించారు. మునగాల,వెలిదండ రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంబాలు ఉన్నాయని,ప్రమాదాలు జరుగుతున్నాయని స్ధానికులు మంత్రికి తెలిపారు. మునగాల మండలంలో మసీదు దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయని జాతీయ రహదారి రోడ్ వెడల్పు చేయాలన్నారు. ఆర్ అండ్ బి అధికారులను రోడ్లు అన్ని లోటుపాట్లు లేకుండా మరమ్మత్తులు చేయాలని అన్నారు. సమీక్ష సమావేశంలో ఏ పదవిలో ఉన్న ప్రజల కొరకే నిరంతరం కృషి చేస్తామన్నారు.పెండింగ్లో ఉన్న పంచాయతీరాజ్ పనులు పూర్తి చేయడంతో పాటు మంజూరు చేయించిన రహదారుల నిర్మాణాలు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. బజరంగంలో మౌలిక సదుపాయాల కలపనకు ప్రభుత్వం సిద్ధంగా విద్యారంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టి తెలంగాణ విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో సూర్యనారాయణ, నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు,టిపిసిసి డెలికేటె లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, వివిధ శాఖల అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.