జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్....

by Kalyani |
జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్....
X

దిశ, సూర్యపేట కలెక్టరేట్ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి యస్. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పై మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి పరిశీలన కార్యక్రమం తో పాటు, ఫారం 6, 7, 8 లను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఫోటో, ఓటరు గుర్తింపు కార్డుల ప్రింటింగ్ కై ఇప్పటివరకు మూడు జిల్లాల నుండి మాత్రమే అప్డేట్ వివరాలు వచ్చాయని, తక్కిన అన్ని జిల్లాలు తక్షణమే సెప్టెంబర్ 24 వరకు అప్డేట్ వివరాలు పంపించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ లో భాగంగా బిఎల్వోలు నూటికి నూరు శాతం పోలింగ్ కేంద్రాలను, పోలింగ్ కేంద్రాల లొకేషన్లను పరిశీలించి ఫోటో అప్లోడ్ చేయాలని తెలిపారు.

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న పబ్లిక్ నోటీసు జారీ చేయడం జరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈఆర్ఓ ల నియామకంపై సవరించిన ప్రతిపాదనలు పంపాల్సి ఉంటే తక్షణమే పంపించాలని జిల్లా కలెక్టర్లతో కోరారు. ఫారం 6,7,8 లకు సంబంధించిన నోటీసు పీరియడ్ పూర్తయి ఉంటే తక్షణమే వాటిని పరిష్కరించాలని, ఓటరు జాబితా పై ఇంటింటి పరిశీలన తర్వాత కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు తక్షణమే పంపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్ రాజు, వేణు, సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవ్, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed