- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్.. ఇక నుంచి పోస్టాఫీసుల్లో విదేశాలకు పార్సిల్ సర్వీస్
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): తపాలా కార్యాలయాల ద్వారా తక్కువ ఖర్చుతో విదేశాలకు పార్సిల్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఈస్ట్ జోనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ గౌని సురేష్ తెలిపారు. బుధవారం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని సబ్ పోస్టాఫీసులో వినియోగదారుల పార్సిల్స్ విదేశాలకు పంపించు విధానంపై తపాలా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల1 నుంచి తక్కువ ఖర్చుతో వినియోగదారులు విదేశాల్లో ఉండే తమ బంధువులకు, ఇతర అవసరాలకు పార్సిల్స్ పంపుకునే సౌకర్యాన్ని తపాలా శాఖ ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు.
వినియోగదారులు తమ జీఎస్టీ నెంబర్, పాన్ కార్డుతో ఎగుమతి, దిగుమతి కోడ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని కరెంటు బ్యాంకు ఖాతా అనుసంధానంతో ఇంటి నుంచి నేరుగా వెబ్ పోర్టల్ ద్వారా పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తపాలా సిబ్బంది వినియోగదారుల నుంచి పార్సిల్ తీసుకొని విదేశాలకు పంపిస్తారన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ షకీల్, బీపీఎం నోముల మహేష్, ఎంవో ఆంజనేయులు, జీడీఎస్ భార్గవి, గౌస్, ఇతర తపాలా సిబ్బంది పాల్గొన్నారు.