ఛాలెంజ్ గా చెబుతున్న..రాసి పెట్టుకోండి : డీసీసీబీ డైరెక్టర్

by Naresh |   ( Updated:2023-10-21 14:39:03.0  )
ఛాలెంజ్ గా చెబుతున్న..రాసి పెట్టుకోండి : డీసీసీబీ డైరెక్టర్
X

దిశ,తుంగతుర్తి: ఛాలెంజ్ గా చెబుతున్నా..అంతేకాదు మీ డైరీలలో రాసి పెట్టుకోండి, రేపటి ఎన్నికల్లో కిషోర్ కుమార్ 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి తుంగతుర్తి చరిత్ర తిరగ రాయబోతున్నారని డీసీసీబీ, డీసీఎంఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా డైరెక్టర్ గుడిపాటి సైదులు విమర్శకులకు సూచించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఇప్పటికే ఆరున్నర వేల కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు అని అన్నారు. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కిషోర్ కుమార్ ద్వారా ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమ పథకాలు అందాయని, అందుకే నిర్భయంగా ప్రజల ముందుకొచ్చి ఓట్లు అడిగే దమ్ము, ధైర్యం తమకే ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి నిరోధకులైన ప్రతిపక్షాలు ఏ పద్ధతిన ప్రజల మధ్యకు వస్తారని, గతంలో కంటే ఈసారి కిషోర్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పారు. ఈ నెల 29 తిరుమలగిరిలో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ గుండగాని వీరాస్వామి, ఉప సర్పంచ్ వెంకన్న, భాష బోయిన వెంకన్న, సొసైటీ డైరెక్టర్ యాకయ్య, అధికార ప్రతినిధి తునికి సాయిలు, మాజీ సర్పంచ్ కొండగడుపుల నాగయ్య, మహిళా మండల అధ్యక్షురాలు తునికి లక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రచ్చ నవీన్, చిర్ర నరేష్, వార్డు, బూతు కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed