- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న సర్పంచ్..
దిశ, దేవరకొండ : మహిళలు వంటింటికే పరిమితం కాదు! వారు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇదే నినాదంతో అటు సమాజ సేవకు ఇటు రాజకీయపరంగా తనను సర్పంచుగా ఎన్నుకున్న గ్రామాన్ని సర్పంచ్ జూలూరు ధనలక్ష్మి అభివృద్ది చేసింది. ప్రజలకు ప్రతి నిత్యం అందుబాటులో ఉంటూ ఆ గ్రామంలోని ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా, ఎప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చే నిధులను ఖర్చు చేసింది. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతుంది. గతంలో హెచ్ఎం టీవీ నిర్వహించిన "నారి" అవార్డు పురస్కారానికి ఎంపికై, నేడు వివిధ సేవలకుగాను, ప్రజా సమస్యలపై నిజాలను నిర్భయంగా మాట్లాడినందుకు, వివిధ ఆధ్యాత్మిక రంగాలలో చురుకుగా పాల్గొని సేవలు చేస్తున్నందుకుగాను మహిళ "ఎక్స్ లెన్సి" అవార్డును శుక్రవారం చిన్న జీయర్ స్వామి చేతుల మీదగా తీసుకుంది.
ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ మహిళ సర్పంచిగా గ్రామంలో ధనలక్ష్మి చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందజేసినట్లు తెలిపారు. అనంతరం సర్పంచి ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు తనకు అందజేసినందుకు శ్రీ చిన్న జీయర్ స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు అంటే తనకు చాలా ఇష్టమని ప్రజల కోసం మంచి చేయడానికి ముందు వరుసలో ఉంటానని తెలిపారు. అందుకే ఈ సేవ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు. మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.