ఆయన ప్రోద్బలంతోనే జిల్లాలో అది జరుగుంది.. మంత్రి జగదీష్ రెడ్డిపై సంకినేని ఫైర్..

by Disha News Desk |
ఆయన ప్రోద్బలంతోనే జిల్లాలో అది జరుగుంది.. మంత్రి జగదీష్ రెడ్డిపై సంకినేని ఫైర్..
X

దిశ, సూర్యా పేట: మంత్రి జగదీష్ రెడ్డి ప్రోద్బలంతోనే జిల్లాలో అవినీతి జరుగుతుందని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీజే‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త కలెక్టరేట్ పక్కనే చెరువు ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేసిన పట్టించుకొని ఆఫీసర్లు.. దళితుడు ఇంటి ముందు డబ్బా కొట్టు పెట్టుకుంటే మాత్రం ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. దళిత వ్యక్తి సమస్య పరిష్కారానికి బీజే‌పీ ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర మున్సిపల్ కమిషనర్ ను సంప్రదిస్తే అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ప్రశ్నించినందుకు సలిగంటి వీరేంద్రపై మంత్రి అండదండలతో అక్రమ కేసులు పెట్టి 8రోజులు జైలులో ఉంచారని మండిపడ్డారు. ఆత్మకూరు(ఎస్) వడ్ల కొనుగోళ్లలో జరిగిన అవినీతిలో అసలు సూత్రధారులైన మిల్లర్లు, అధికారులపై కేసులు నమోదు చేయకుండా అక్రమాలతో సంబంధంలేని వారి మీద కేసులు పెట్టారన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులకు అండగా నిలిచిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను వెంటనే ఎత్తివేయాలని, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడిన వారిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడిన, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై, పేద ప్రజల పక్షాన సూర్యాపేటలో బీ‌జేపీ పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యాక్రమంలో బీజే‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిది పల్సా మల్సూర్ గౌడ్, పట్టణ అధ్యక్సుడు హబీబ్, సీనియర్ నాయకులు చలమల నర్సింహా, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మీర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story