సాగర్ రెండు క్రష్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల

by Sridhar Babu |
సాగర్ రెండు క్రష్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల
X

దిశ, నాగార్జునసాగర్ : ఎగువ శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం తిరిగి కొనసాగడంతో ఎన్ఎస్పి అధికారులు బుధవారం రెండు గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 63,123 క్యూసెక్కుల వరద వస్తుండటంతో సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిడటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590

అడుగుల వద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,394 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 7528 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 7601 క్యూసెక్కుల నీటిని, ఎస్ ఎల్ బీ సీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని, లోలేవల్ కెనాల్ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుండి మొత్తం 63,123 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed