- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రోడ్డెక్కిన పత్తి రైతులు
దిశ, మర్రిగూడ : మండలంలోని సరంపేట హరిహర కాటన్ మిల్లు సీసీఐ కేంద్రం వద్ద పత్తి రైతులు గురువారం ఆందోళన చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు రెండు మాచర్ మిషన్లు పెట్టి పైసలు ఇచ్చిన వాళ్లకే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టడంతో సీసీఐ వారు పత్తిని కొనుగోలు చేయలేదు. దీంతో పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు రోడ్డుపై బైఠాయించారు .మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా కొంతమంది రైతులు మాట్లాడుతూ డీసీఎం వాహనాలు తీసుకువచ్చిన దళారుల వద్ద సీసీఐ వారు డబ్బులు తీసుకుని పత్తిని మాచర్ చూడకుండానే కొనుగోలు చేస్తున్నారని, రైతుల పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఆందోళన తీవ్రం కావడంతో రైతులు రెండు మిషన్లను రైతుల ముందు ప్రదర్శింప చేశారు. మాచర్ మిషన్ లో తేడాలు రావడంతో రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. స్థానిక తహసీల్దార్ బక్క శ్రీనివాస్, ఎస్ఐ రంగారెడ్డి రంగప్రవేశం చేసి రైతులతో మాట్లాడి ధర్నాను విరమింప చేశారు. పత్తి కొనుగోలు చేయాలని సీసీఐ వారిని వారు ఆదేశించారు. అధికారుల ఆదేశంతో సీసీఐ సిబ్బంది వెంటనే కొనుగోలు ప్రారంభించడంతో రైతులు శాంతించారు.