పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష

by Naveena |
పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష
X

దిశ,చింతపల్లి: దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు,ఇతర ఇరిగేషన్ సమస్యలపై మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గంలో పెండింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను, పూర్తి చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఎమ్మెల్యే బాలు నాయక్ వివరించారు. నూతనంగా ప్రతిపాదించిన నేరేడుగొమ్ము, మండలంలో గాజుబేడం లిఫ్ట్, రామనోనిబండ లిఫ్ట్ చందంపేట, మండలంలో చిత్రియాల, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సర్వే పనులను త్వరగా చేపట్టాలని కోరారు. అదే విధంగా కరువు ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గంలో భూగర్భజల మట్టాలు పెరగడానికి చెక్ డ్యాం లు నిర్మించాల్సిన ఆవశ్యకతను మంత్రి కి వివరించారు. అలాగే ఆర్ అండ్ ఆర్ సమస్యలను పరిష్కరించాలని, ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. దేవరకొండ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మా రెడ్డి, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ, సీఈ, ఎస్ఈలు, ఈఈలు, డిఈలు, కాంట్రాక్టర్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed