- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడీకి బీ టీంగా పనిచేస్తున్న రేవంత్
దిశ, సూర్యాపేట : బీజేపీ ఆడిన లిక్కర్ స్కాం నాటకంలో ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి బీ టీంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏనాటికైనా బీజేపీలో గంపగుత్తుగా విలీనం అయ్యేది తెలంగాణ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు. కడిగిన ముత్యంలా బయటికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్, బీజేపీలు దిగజారుడు, నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలని తప్పు పట్టేలా వారి విమర్శలు ఉన్నాయని అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ఆది నుండి తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని చెప్తూనే ఉన్నారని, ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చాక ఈ విషయం బయట పడిందని అనుమానం వ్యక్తం చేశారు.
అసలు లిక్కర్ స్కామ్ అనేది ఒట్టి ఫాల్స్ అని, అదంతా బీజేపీ కుట్రలో భాగమని, అటు కేజ్రీవాల్ ని, ఇటు కేసీఆర్ ను అణగ ద్రోక్కాలనే దురుద్దేశంతో బీజేపీ ఆడిన నాటకమని పేర్కొన్నారు. విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో జడ్జిలు అడిగిన ప్రశ్నలకు ఈడీ, సీబీఐ అధికారులు విలవిల్లాడాయని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మోడీ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ ఓ బూటకపు కేస్ పెట్టి ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల అకౌంట్లోకి రూ.45 కోట్లు వచ్చాయని, దానిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సిన గత్యంతరం తమకు లేదన్నారు. మున్ముందు దేశ,రాష్ట్ర రాజకీయాల్లో చక్రం దిప్పేది ముమ్మాటికీ కేసీఆర్ అని, ఆయను చూస్తే మోడీకి ఇప్పటికి భయమేస్తుందని పేర్కొన్నారు.