- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దిశ' కథనానికి స్పందన.. భారీ పోలీస్ బందోబస్తుతో కూల్చివేత
దిశ, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలోని చిట్యాల ప్రధాన రహదారి సమీపంలోనిదిశ, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలోని చిట్యాల ప్రధాన రహదారి సమీపంలోని దుకాణాల మధ్యలో ఉన్న 12 ఫీట్ల రోడ్డు, మురికి కాల్వలను ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణం చేపట్టిన అక్రమ కట్టడాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మునుగోడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం పోలీసుల సహకారంతో కూల్చివేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ అక్రమ కట్టడాలపై ధర్నాలు, దీక్షలు, నిరసనల ఫలితంగా జిల్లా యంత్రాంగం స్పందించి అక్రమ కట్టడాలపై దృష్టి సారించారు. పది రోజుల క్రితం అక్రమ కట్టడాలు స్వచ్ఛందంగా తొలగించాలని అక్రమార్కులకు నోటీసు ఇచ్చిన స్పందించకపోవడంతో గ్రామపంచాయతీ అధికారులు కూల్చివేతకు రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం నుండి కూల్చివేతను ప్రారంభించారు. అక్కడక్కడ అక్రమార్కులు కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. అక్రమ నిర్మాణాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కూల్చివేతకు గురవుతుందని అధికారులు హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాల కబ్జా చేసిన మురికి కాల్వ, సీసీ రోడ్డును కబ్జాదారుల నుంచి విడిపించడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు: నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి..
మునుగోడు మండల కేంద్రంలో రోడ్లను ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. మునుగోడు చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా దుకాణదారులు ఆక్రమించుకొని పాకలు వేసి ఉన్న వాటిని తొలగించాలని హెచ్చరించారు. రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారులు రోడ్డుపైన పండ్ల బండ్లు పెట్టి అమ్మకాలు జరుగుతుండడంతో ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. చిరు వ్యాపారులు ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.