- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేకాట రాయుళ్ల అరెస్ట్..నగదు, కార్లు, బైకులు స్వాధీనం..
దిశ, చిట్యాల: చిట్యాల పట్టణ శివారులోని ఓ తోటలో గుర్తుతెలియని వ్యక్తులు పేకాట ఆడుతుండగా పక్కా సమాచారంతో చిట్యాల పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందం సహకారంతో అరెస్ట్ చేసినట్లు నార్కట్ పల్లి సీఐ శివరాంరెడ్డి తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. చిట్యాల పట్టణ శివారులోని కొంతం సత్తిరెడ్డి అనే రైతు తోటలో రైతుకు తెలియకుండా వేర్వేరు ప్రాంతాలకు చెందిన గుర్తుతెలియని 13 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందింది.
వెంటనే స్థానిక ఎస్ఐ ఎన్ ధర్మ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహకారంతో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి పగిళ్ల రమేష్, అయితేగొని భుజంగం గౌడ్, షేక్ సుభాని మెహబూబ్ భాష, షేక్ ఉమర్ అలీ, తాడిచెట్టు రాఘవేందర్, గుడిపాటి శ్రీనివాస్, గంజి రవికుమార్, జిన్నే అనంతరెడ్డి, రావుల పెంట కిరణ్ కుమార్, కమాద్రి సంతోష్, పంగా గోపి, కోలా రాములను అక్కడికక్కడే అరెస్ట్ చేయగా రమేష్ అనే వ్యక్తి పరారయ్యాడు. వీరి నుంచి మూడు కార్లు, రెండు బైకులు, రూ. 3,03,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది వ్యక్తులు గునగంటి కిరణ్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో స్థలాలు మారుస్తూ గత కొద్ది రోజులుగా పేకాట ఆడుతున్నారు. ఈ క్రమంలో వీరి పై హైదరాబాద్ తో పాటు నల్లగొండ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదై ఉన్నాయి. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివరాం రెడ్డి వివరించారు.