- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుంగతుర్తి నుండే పోటీలో ఉంటా.. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
దిశ, మోత్కూరు : రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేస్తానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. ఆదివారం మోత్కూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోనే తన పయనమని, ఆయనతోనే జాతీయ పార్టీలో చేరతామని, నాలుగైదు రోజుల్లో ఏ పార్టీలో ఎప్పుడు చేరేది ప్రకటిస్తామన్నారు. తుంగతుర్తి నుంచే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారనిప్రశ్నించగా తాను తుంగతుర్తి, కంటోన్మెంట్, చేవెళ్ల, స్టేషన్ ఘనపూర్ స్థానాల్లో ఒకస్థానం నుంచి పోటీచేయాలనుకోగా తుంగతుర్తి నుంచే విజయ అవకాశాలు ఉన్నాయన్నారు. దాంతోనే తుంగతుర్తి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తనకు మంచి అనుబంధం ఉన్నాయని, తుంగతుర్తిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎంపీ వెంకట్ రెడ్డి మద్దతు కోరతానన్నారు.
స్థానికుడు, కులం తెలంగాణ ఉద్యమకారునిగా అవి తనకు వర్తించవన్నారు. తెలంగాణ తెచ్చిన దాంట్లో కేసీఆర్ ఎంతగాకొట్లాడారో నేను కూడా అంతే కొట్లాడానని, జనానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే, విద్యార్థులకు తాను నాయకత్వం వహించానన్నారు. తుంగతుర్తి నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యే కిశోర్ కుమారును ఏ విధంగా ఎదుర్కొంటారని ప్రశ్నకు కేసీఆర్ తో నాకు పోటీ అని, మధ్యలో కిషోర్ లాంటి చిన్నచిన్నవాళ్లను పట్టించుకోనని సమాధానమిచ్చారు. తుంగతుర్తి ప్రజలకు మీరు ఏంచెప్పాలనుకుంటున్నారని అడగ్గా కొట్లాటలు, దాడులు ఉండవని, ప్రశాంత వాతావరణం నెలకొల్పుతానని, ఎవరి పని వారు చేసుకోవాలని, ఒకరి జీవితంలో మరొకరు వేలు పెట్టకుండా ప్రశాంత వాతావరణం తీసుకొస్తానన్నారు.
తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటుందని, సీఎం కేసీఆర్ ఉద్యమ కారులను ప్రక్కన పెట్టి తెలంగాణ వద్దన్న వాళ్లను తెచ్చి పెట్టుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఉద్యమకారులకు ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదనిప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్ రూ.నాలుగైదు లక్షలు జీతం తీసుకుంటుంటే ఆయనతో పాటు జెండాపట్టినోళ్లు, అరెస్టు అయినోళ్లు, జైలుకు పోయినోళ్లు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. శ్రీకాంత్ చారి తల్లిశంకరమ్మ, తెలంగాణ విఠల్ లాంటి ఉద్యమకారులు ఎటుపోయారని, పిడమర్తి రవి ఎందుకు కేసీఆర్ పక్కన కనిపించడం లేదన్నారు.
ఉద్యమంలో అనుకున్నవి కేసీఆర్ చేయకపోవడంతోనే నాలుగేళ్ల క్రితమే ఆయన్ను వదిలిపెట్టి ప్రజల్లోకి వచ్చామని, కేసీఆర్ ను మార్చాలన్నదే ప్రధాన లక్ష్యమని, ప్రజలుకూడాఅదేకోరుకుంటున్నందున పార్టీలో చేరిన తర్వాత కార్యాచరణ, ఉద్యమం మొదలు పెడతామన్నారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చేడె మహేందర్, ఎర్రబెల్లి కృష్ణ, చిరుమర్తి రాజు, బండి మధు, చుక్క శ్రీకాంత్, తొంట నరేష్, సురేష్, నోముల రమేష్, బందెల రవి తదితరులు ఉన్నారు.