జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్

by Naresh |   ( Updated:2024-02-02 14:26:10.0  )
జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్
X

దిశ, సూర్యాపేట : జిల్లాలో నెలరోజుల పాటు జిల్లా పోలీసు, బాలల రక్షణ,లేబర్, రెవెన్యూ,హెల్త్ మొదలగు డిపార్ట్మెంట్‌ల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెల్లడించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… స్మైల్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరాదరణకు, వెట్టిచాకిరికి గురవుతున్న 182 మంది బాలలను గుర్తించి పిల్లల తల్లిదండ్రులకు, సంరక్షులకు క్షేమంగా అప్పగించడం జరిగిందని చెప్పారు. ఇందులో తెలంగాణకు చెందిన 85 మంది బాలురు ,11 మంది బాలికలు ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన 65 మంది బాలురు, 21 బాలికలు ఉన్నట్లు వెల్లడించారు.

అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ టీమ్స్ వివిధ ప్రదేశాల్లో వీరందరినీ గుర్తించి వారికి రక్షణ కల్పించడం జరిగిందన్నారు. అందుకు ఈ ఆపరేషన్ స్మైల్ ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని చేరేలా అన్ని శాఖల సిబ్బంది బాగా పని చేశారని కొనియాడారు. ఇక నుంచి భాలల రక్షణలో భాగంగా తనిఖీలు నిరంతరంగా నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. అందుకోసం బాలల వికాసానికి, బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఎవరైనా పిల్లలను వెట్టిచాకిరికి గురిచేసే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా 182 మంది పిల్లలను గుర్తించడం కోసం శ్రమించిన పోలీసు సిబ్బంది, వివిధ శాఖల సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. పిల్లలకు చదువులతో మంచి భవిష్యత్తు ఉందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని, ప్రభుత్వాలు ఉచిత వసతి తో కూడిన విద్యను అందిస్తున్నందున పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారికి బంగారు భవిష్యత్తును అందించాలని ఎస్పీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

Read More..

Breaking: భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో చెలరేగిన మంటలు, 16 మందికి గాయాలు (వీడియో)

Advertisement

Next Story

Most Viewed