- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sagar gates : రేపు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. ముహూర్తం ఫిక్స్ చేసిన అధికారులు..
దిశ, నాగార్జునసాగర్ : కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానదికి గంట గంటకూ వరద ఉదృతి పెరుగుతోంది. ఇప్పటికే ఎగువ ప్రాంతంలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి. దీంతో ఆల్మట్టి నుంచి 3 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారు. అలాగే నారాయణ పూర్ నుంచి కూడా అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నారాయణ పూర్ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగానే అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. అలాగే తుంగభద్ర నుంచి లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇలా ఆల్మట్టి, తుంగభద్రల నుంచి శ్రీశైలంకు 4,41,222 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా వస్తున్నది. దాంతో శ్రీశైలం క్రస్ట్‌గేట్లలో 10 గేట్లను 20 అడుగల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద ప్రవాహం...
10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి 4,64,740 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 4,54,710 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,26,501 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 883.30 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు, ప్రస్తుతం 204.7888 టీఎంసీలు, కుడి గట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి 576.40 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం. సాగర్‌కు డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 576.40 అడుగులకు చేరుకుంది. అలాగే సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 274 టీఎంసీలు దాటింది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో రేపు డ్యాం నిండనుంది. దీంతో రేపు సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే సాగర్ నిండిపోవడంతో ఆయకట్టు రైతులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.