డీసీసీబీలో ఇష్టారాజ్యం.. ఎన్నికల కోడ్ ఉన్న బదిలీలు

by Mahesh |
డీసీసీబీలో ఇష్టారాజ్యం.. ఎన్నికల కోడ్ ఉన్న బదిలీలు
X

దిశ, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ బ్యాంక్ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఈ మధ్యనే అధికారులు బదిలీలు నిర్వహించడంతో అందరి ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్ల అనుమతి బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా అధికారుల సీనియార్టీ రైతులకు పంట రుణాలు అందజేత రుణాల వసూలు రికవరీ ఆధారంగా అధికారుల సమర్థతకు ప్రాధాన్యత ఇచ్చి బదిలీ నిర్వహించాల్సిన అవసరం ఉంది కానీ అధికారులు భారీ ఎత్తున లక్షల్లో ముడుపులు పుచ్చుకుని బదులు నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జిల్లా బ్యాంకు పాలకవర్గం సభ్యులు పార్లమెంటు శాసనమండలి ఎన్నికలలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇదే అదునుగా భావించిన జిల్లా బ్యాంకు అధికారి తన ఇష్టానుసారంగా దాదాపు 70 మంది ఉద్యోగులను బదిలీ చేయడంతో బ్యాంకులో గందరగోళానికి కారణమైందని చెప్పవచ్చు. గతంలో పనిచేసిన బ్యాంక్ ఉన్నతాధికారి పనిచేసిన కాలం డిసిసిబి బ్యాంకులో అనేక అక్రమాలు అవినీతి సీనియర్లకు జూనియర్లకు తేడా లేకుండా బదిలీలు చేయడం, పదోన్నతులు కల్పించడం తో అనేక అక్రమాలు అవినీతి ఆరోపణలు చోటుచేసుకున్నాయని విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ ప్రభుత్వం మారింది బ్యాంకు అధికారి మారారు ఇప్పుడైనా మంచి రోజులు వస్తాయని బ్యాంకు ఉద్యోగులంతా భావించారు.. కానీ గతంలో పనిచేసిన అధికారి కంటే ఇప్పుడు వచ్చిన అధికారి 100 రేట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇష్టారాజ్యంగా బదిలీలు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నూతనంగా వచ్చిన అధికారి ఇష్టారాజ్యంగా బదిలీలు నిర్వహించారని విమర్శలున్నాయి. వాస్తవంగా ఒకచోట మూడు సంవత్సరాల కంటే ఎక్కువ పని చేసి ఉంటే లాంగ్ స్టార్టింగ్ పేరుతో అధికారికి బదిలీ చేస్తారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ పని చేసిన అధికారులకు బదిలీ అయ్యే అవకాశం లేదు. కానీ ఇక్కడ మాత్రం లాంగ్ స్టాండింగ్ గా పని చేస్తున్న అధికారులను పక్కనపెట్టి ఒకటి రెండు సంవత్సరాలు చేసిన అధికారులని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఉమ్మడి జిల్లా బ్యాంకు వ్యవస్థలో మేనేజర్ నుంచి స్టాఫ్ అసిస్టెంట్ వరకు సుమారు 70 మందిని ఈ మధ్య బదిలీ చేసినట్లు తెలిసింది. ఒకే చోట ఇంత తక్కువ కాలం పనిచేసినప్పటికీ తమను ఎట్లా బదిలీ చేస్తారని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కానీ నియంతల వ్యవహరిస్తున్న అధికారిని ప్రశ్నిస్తే తమకు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు ఎవరు కూడా ముందుకు రావడం లేదని బ్యాంకు సిబ్బంది వాపోతున్నారని సమాచారం.

లక్షల్లో చేతులు మారిన వైనం

బ్యాంకు కేంద్ర కార్యాలయంలో దాదాపు 25 మంది సుమారు ఆరేళ్లకు పైగా అక్కడే పనిచేస్తున్నారు. ప్రకారం ఒకే చోట మూడేళ్లు పనిచేస్తే బదిలీ కావాల్సి ఉంటుంది. కానీ వాళ్లకు బదిలీ కాలేదు. దానికి ప్రధాన కారణం జిల్లా బ్యాంక్ ఉన్నతాధికారికి లాంగ్ స్టాండింగ్ ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు మధ్య ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి రూ.70వేలు చేతులు మారినట్లు తెలుస్తోంది... మొత్తంగా రూ.15 లక్షలు వసూలు అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

ఎన్నికల కోడ్ వర్తించదా...!!

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మన రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటికీ కౌంటింగ్ కాలేదు దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఈనెల 27న జరగనుంది. అందుకే ఎన్నికల కోడ్ ఇంకా కొనసాగుతుంది. సహజంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు బదిలీల సంగతి దేవుడెరుగు కానీ డిప్యుటేషన్ కూడా చేయరు. ఒకవేళ చేస్తే దానికి బాధ్యులైన అధికారులు అందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. కానీ డిసిసిబి బ్యాంక్ అధికారికి ఎన్నికల కమిషన్ అంటే లెక్కలేనితనమని స్పష్టంగా ఇక్కడ అర్థం అవుతుంది.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు... అంతా నా ఇష్టం... నా మార్క్.... బ్యాంకుపై ఉండాలే అనే పద్ధతిలో బదిలీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కనీసం బ్యాంకు పాల పాలకవర్గం ప్రమేయం కూడా లేకుండా చేశారని సమాచారం.. ఇదంతా జరుగుతున్న విషయాన్ని గ్రహించిన పాలకవర్గం చైర్మన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి బదిలీలు చేయకూడదని సూచించినప్పటికీ అధికారి ఆ మాటలు పెడచెవినపెట్టి బదిలీ చేశారని తెలుస్తోంది.

ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు

రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి బదిలీలు చేయడం కాదు.. సీనియారిటీ, సిన్సియారిటీ బ్యాంకు నిబంధనల ప్రకారం బదిలీ చేయండి... లేకపోతే ఉద్యమం తప్పదని ఓ అధికారి జిల్లా అధికారిని పరోక్షంగా ఇచ్చినట్లు సమాచారం... అదే క్రమంలో బ్యాంకు అధికారి తీరుపై తొందర్లోనే ఉద్యమం చేపట్టనున్నట్లు బ్యాంకు సిబ్బంది పేర్కొంటున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని స్థాయిలో ఉన్న ఉద్యోగులతో ఓ దఫా చర్చలు అయినట్లు కూడా వినికిడి. ఎన్నికల కోడ్ పూర్తికాగానే ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.



Next Story