జగిత్యాల జిల్లాలో వడగండ్ల వాన

by Sridhar Babu |
జగిత్యాల జిల్లాలో వడగండ్ల వాన
X

దిశ,పెగడపల్లి : వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా జగిత్యాల జిల్లాలో ఒక్కసారిగా వడగండ్ల వాన కురిసింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో వరి పంట పొట్టకు వచ్చి ఉండటం మరి కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంది.

దాంతో అకాల వర్షం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన పడుతున్నారు. అకాల వర్షానికి కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఇప్పటికే చలి తీవ్రత వల్ల మామిడి దిగుబడి తగ్గే అవకాశం ఉండగా ఈదురు గాలులతో అక్కడక్కడా మామిడి కాయలు నేలరాలాయి. వచ్చే రెండు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో మామిడి రైతుల్లో ఆందోళన మొదలైంది.

Next Story