- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి..
దిశ, నేరేడుచర్ల : రైతులు పండించిన ప్రతిదాన్యం గింజకు రైస్ మిల్లర్లు తరుగుల పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్ మార్కెట్ ఆఫీస్ లో మిల్లర్ ఓనర్స్, వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అదికారులు రైతులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రైతు కష్టపడి పండించిన పంటను నిబద్ధతతో రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని లేనిపోని కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. బస్తాలో వచ్చే ధాన్యానికి ఒక కిలో తరుగు మాత్రమే తీయాలని సూచించారు. ప్రతిగింజ కూడా మిల్లరు కొనుగోలు చేయాల్సిందేనని గ్రేడ్ల పేర్లతో ధరలు వ్యత్యాసం చూపించవద్దని అన్నారు. రైతులు కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రతిగింజను హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పరిదిలోని రైస్ మిల్లులో అమ్మకాలు చేసుకోవచ్చునని అన్నారు.
అలాగని రైతులు కూడా తొందరపడి పచ్చని పోలాన్ని కోయవద్దని రైతులకు సూచించారు. పండించిన దాన్యంలో పచ్చగింజ తాలు లేకుండా నాణ్యతగా అందిసై రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానన్నారు. ధాన్యం కోనుగోలులో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చునని రైతులను కోరారు. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి ఇక్కడ రైతులకు మధ్దతు ధరను అడిగితెలుసుకొన్నారని అన్నారు. రైతులకు రైస్ మిల్లర్స్ అందిస్తున్న ధరలపట్ల సానుకూలంగా స్పందించి తర్వాలో 300ఎకరాలలో పెద్ద ఎత్తున ఆధునిక పద్ధతిలో రైస్ మిల్లులు ఏర్పాటు చేసి ఇక్కడ పండించిన పంటను ఇక్కడే బియ్యం తయారు చేసి ఎగుమతి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే అత్యధికంగా వ్యవసాయ రంగంలో ముందుందని అన్నారు.
ఇది రైతుప్రభుత్వమని సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజల గురించి వారికి ఏ విధంగా అభివృద్ధి పరచాలని ఆలోచిస్తున్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం సాధించొచ్చు అన్నవారికి పచ్చనిపంటలు, దాన్యం రాశులే సమాదానం అన్నారు. రెవెన్యూ అధికారులు ప్రతిరోజు కాంటాలను వేబ్రిడ్జ్ లను తనీఖీ చేయాలని ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ, మాజీ మున్సిపల్ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మెన్ మెడెం రామలింగారెడ్డి, హుజూర్‌నగర్ సీఐ రామలింగారెడ్డి, హుజూర్‌నగర్, నేరేడుచర్ల తాహశీల్దార్ జయశ్రీ, సరిత రైస్ మిల్లర్లు రైతులు పాల్గొన్నారు.