- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు హుజూర్ నగర్‌కు రానున్న మంత్రులు
దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈనెల 14 గురువారం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి . శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో 2160 సింగిల్ బెడ్ రూం ప్లాట్స్ రూ. 74.80 కోట్లు మంజూరు చేయగా పనులు పునఃప్రారంభం చేయనున్నారు. 5 గంటలకు హుజూర్ నగర్ నుండి పాలకవీడు మండలంలోని బెట్టె తండాకు బయలు దేరుతారు. 5.30 అక్కడికి చేరుకొని మూసీ నదిపై రూ. 33.83 కోట్లతో బెట్టె తండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ లిఫ్టు పనులు పూర్తి అయితే 2041 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పథకం క్రింద బెట్టె తండా, సజ్జా పురం, పాండ్య తండా గ్రామాల రైతులకు లబ్ధి చేకూరాలని ఉంది. లిఫ్ట్ పనులు ప్రారంభం తర్వాత మంత్రులు రైతుల ఉద్దేశించి మాట్లాడనున్నారు. సభ ప్రాంగణాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాలోతు మోతిలాల్ ఇరిగేషన్ డి ఈ అమరేందర్ రెడ్డి పరిశీలించారు.