లింగాల గ్రామ ముఖద్వారానికి.. మంత్రి శంకుస్థాపన..

by Sumithra |
లింగాల గ్రామ ముఖద్వారానికి.. మంత్రి శంకుస్థాపన..
X

దిశ, పెన్ పహాడ్ : మండల పరిధిలోని లింగాల గ్రామానికి వెళ్లే ఎక్స్ రోడ్ సమీపంలో రహదారి వద్ద కీర్తిశేషులు దాచేపల్లి పెద్ద వెంకయ్య లింగమ్మ దంపతుల, జ్ఞాపకార్థం కుమారుడు దాచేపల్లి సుధాకర్, స్వరూప, రాణి, దంపతులు చేపడుతున్న లింగాల గ్రామ ముఖద్వారానికి ఆదివారం రాష్ట్రవిద్యుత్ శాఖ మంత్రి గుంతకళ్ల జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదర్స్ డే రోజున తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం వారి కుమారుడు దాచేపల్లి సుధాకర్ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనియమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నేమ్మాది భిక్షం, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, సర్పంచ్ మామిడి వెంకన్న, పీఎసీఎస్ చైర్మన్లు నాతల జానకిరామ్ రెడ్డి, వెన్న సీతారాం రెడ్డి సర్పంచ్ చెను శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళ నాయకురాలు గార్లపాటి స్వర్ణ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నల్లపు శ్రీనివాస్, రణపంగ సైదులు, మామిడి శోభన్ బాబు, యేసు రాజు దుర్గయ్య, మామిడి నవీన్, షేక్ మహబూబ్ అలీ, రణపంగ దుర్గయ్య, రణపంగ నరసయ్య, దుర్గయ్య, సైదులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed