- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద
దిశ, చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. దాంతో ప్రాజెక్టు చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. 15 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతమైన నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు రావటంతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పరిసరాల్లోని హోటళ్లు కిక్కిరిసిపోయాయి. వారాంతపు సెలవులు కావడంతో సుదూర ప్రాంతాల నుండి పులిచింతల ప్రాజెక్టు చూసేందుకు సందర్శకులు వస్తున్నారు.
ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. తెలంగాణ జెన్కో అధికారులు 4 యూనిట్ల నుండి 70 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ఎస్ఈ దేశ్య నాయక్ తెలిపారు. విద్యుత్ ఉత్పాదన కోసం 6400 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 35. 864 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటివరకు నీటిమట్టం 168.20 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 3,29,189 క్యూసెక్కులు కాగా 15 ప్రాజెక్టు రేడియల్ గేట్లు ఎత్తి 3,16,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.