నిర్లక్ష్యం.. నీటి వృధా..!

by Mahesh |
నిర్లక్ష్యం.. నీటి వృధా..!
X

దిశ, చిలుకూరు: మండలంలోని రామాపురం (కట్టకొమ్ముగూడెం) లో కొద్ది రోజులుగా స్థానికులకు తాగు నీరందించే పైప్ లైన్ లీకై నీరంతా వృథా అవుతుంది. గ్రామంలోని చర్చి ప్రాంతంలో 3హెచ్‌పీ బోర్ మోటార్ ఉంది. దీని ద్వారానే గ్రామంలోని తాగునీటి ట్యాంకులకు నీరు సరఫరా అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ బోర్ మోటార్ పైపులు పలుచోట్ల లీకవుతున్నాయి. పలుమార్లు సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలియజేసిన నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వేసవిలో ఇలా అయితే ఎలా..?

వేసవిలో నీరు ఇలా వృధా అయితే తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదముంది. గ్రామ పంచాయతీ, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. సమస్యను వెంటనే పరిష్కరించాలి. - రాయబారపు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్, రామాపురం‌.

మరమ్మతులు చేస్తాం..

లీకేజీ మరమ్మతులు చేయాలంటే బోరు మోటార్ రెండు రోజుల పాటు నిలిపివేయవలసి ఉంటుంది. దీంతో తాగునీటి సమస్య వచ్చే ప్రమాదముంది. అయినా మరమ్మతులు ప్రారంభిస్తాం. లీకేజీలను నియంత్రిస్తాం. - మీసాల గంగ లింగయ్య, సర్పంచ్, రామాపురం.

Advertisement

Next Story

Most Viewed