నేను రాజీనామా చేయను... లేదు, లేదు మీరు చెయ్యాల్సిందే...

by S Gopi |   ( Updated:2022-09-01 02:51:57.0  )
నేను రాజీనామా చేయను... లేదు, లేదు మీరు చెయ్యాల్సిందే...
X

దిశ, కోదాడ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ పార్టీకి వర్గాల పోరు తలనొప్పిగా మారింది. ఏ వర్గానికి అనుకూలంగా మాట్లాడినా మరొక వర్గం అలక పట్టక తప్పని పరిస్థితి. ఈ క్రమంలోనే నాయకులు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి... అటువంటి పరిస్థితి మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలలో భాగంగా చిమిరియాల ప్రాథమిక సహకార సంఘం ఒప్పందాలపై ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా మారింది.

గతంలో టీడీపీలో ముఖ్య నాయకుడిగా ఉన్న కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరే ముందే ఆయన సొసైటీ చైర్మన్ పదవి హామీ మీదనే చేరడంతో తప్పని పరిస్థితిలో ఆయనకి చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా ఇచ్చారు. అదే పదవి కోసం సైతం తీవ్రంగా కృషి చేయడంతో... ఎమ్మెల్యే ఇరువురిని పిలిపించి మాట్లాడుకుని సమస్యను కొలికి తేవాలని ఆదేశించడంతో ఇరువురు చిరకా రెండున్నర సంవత్సరాల పదవి చేపట్టేందుకు సముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ఆయనకు మొదటి రెండున్నర సంవత్సరాల పదవి చేపట్టేందుకు అంగీకారం జరిగింది.

పూర్తయిన రెండున్నర సంవత్సరాలు..

ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం రెండున్నర సంవత్సరాల పూర్తయిన ప్రస్తుత చైర్మన్ తన పదవికి రాజీనామా చేయకుండా, కొనసాగడంపై మరో టీఆర్ఎస్ వర్గం నేత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. మాట ఒప్పందం ప్రకారం రాజీనామా చేయకుండా పదవి కొనసాగడం.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోవడంతో ఇరువురు మధ్య విభేదాలకు దారి తీసింది.

Also Read : 'కేసీఆర్ ఒక మాటకారి.. మోసకారి'

Advertisement

Next Story

Most Viewed