మేళ్లచెరువు జాతరకు పటిష్టమైన బందోబస్తు

by S Gopi |
మేళ్లచెరువు జాతరకు పటిష్టమైన బందోబస్తు
X

దిశ, మేళ్లచెరువు: మహా శివరాత్రి సందర్భంగా మేళ్లచెరువు జాతరకు సంబంధించిన పోలీసు బందోబస్తు ఏర్పాటు వాహనాల మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలు, రోడ్డు మార్గాలు, జాతర నిర్వహించే స్థలం, దేవాలయం భద్రత పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేల్లచేరువు మహాశివరాత్రి జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు, ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. మంగళవారం జాతర జరుగు ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతాలు, రోడ్డు మార్గాలు పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై, జాతర నిర్వహణపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. భక్తులు, ప్రజలు జాతరను, ఉత్సవాలను భక్తిశ్ర్ధలతో నిర్వహించుకోవాలని, ఎవ్వరూ గొడవలు, తగాదాలు పెట్టుకోవద్దు అని అన్నారు. జాతర ప్రాంతంలో అసాంఘిక చర్యలకు అవకాశం లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. దేవాలయం సిబ్బంది, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పని చేస్తామని తెలిపినారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని దేవాలయ సిబ్బందిని ఆదేశించారు.

నాలుగు వైపుల పార్కింగ్

జాతరకు వచ్చే భక్తులు వాహనాలు నిలుపుకోవడానికి మేళ్ళచెరువు వచ్చి పోయే అన్ని ప్రధాన మార్గాల్లో పార్కింగ్ ప్రదేశాలు, హోల్డింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామన్నారు. బారికెడ్స్, సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేశామన్నారు. జాతరను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. స్పెషల్ టీమ్స్ తో గస్తీ నిర్వహిస్తామన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు. జాతర ప్రాంతంలో పోలీస్ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, కోదాడ హుజూర్‌నగర్ సీఐలు పీఎన్డీ ప్రసాద్, రామలింగారెడ్డి, మేళ్లచెరువు, కోదాడ రూరల్ ఎస్సైలు సురేష్, సాయి ప్రశాంత్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story