చెరువు మాయం.. కోట్లాది రూపాయల విలువగల భూమి కబ్జా

by Anjali |
చెరువు మాయం..  కోట్లాది రూపాయల విలువగల భూమి కబ్జా
X

దిశ, కోదాడ: కోదాడ పట్టణానికి తూర్పు వైపున శ్రీరంగాపురం గ్రామం ఉండేది. ఈ గ్రామానికి దక్షిణం వైపు 30 ఎకరాల విస్తీర్ణంలో సాగిచెరువు ఉండేది. పూర్వ కాలంలో ఈ గ్రామ రైతులు వ్యవసాయానికి ఈ చెరువు నీటినే ఉపయోగించేవారని చెబుతున్నారు . కాగా సర్వే నెంబర్లు 753,755,756, 757,758 లతో పాటు 552,553లలో సుమారు 30 ఎకరాల లో సాగిచెరువు ఉంది. సాగర్ కాల్వ రావడంతో ఈ చెరువు ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో పాటు చెరువు కింద ఉన్న వ్యవసాయ భూములు కూడా ప్లాట్లుగా మారడంతో చెరువు అవసరం లేకుండా పోయింది. ఇదే అదునుగా చెరువు మొత్తం అక్రమార్కులు కబ్జా చేశారు. దీంతో ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం వాటిల్లింది. సమీపంలో ఉన్న ఓ బడా రైతుతో పాటు పట్టణానికి చెందిన మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యో గులు ఈ చెరువు భూములపై కన్నెశారు.

ఈ చెరువు ఆక్రమణకు తెరలేపిన వీరు ముందు కట్టకు గండిపెట్టారు. దీంతో చెరువు నీరు నీలువ ఉండకుండా కిందికి పోయేది. ఆ తర్వాత నెమ్మదిగా చెరువు కట్ట, అలుగు, తూములను మాయం చేశారు. దీంతో చెరువు భూమి పూర్తిగా తేలిపోయింది. ఈ తంతు జరుగుతున్న సమయం లో కొందరు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సర్వే చేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమ ణలో సదరు వ్యక్తులే కీలకంగా ఉండడంతో వి చారణ అటకెక్కింది. దీంతో విసుగుపుట్టిన గ్రామ స్తులు ఆ విషయాన్ని వదిలేశారు. పట్టా భూమిగా చూపి సదరు వ్యక్తులు దర్జాగా అనుభవిస్తున్నారు. అధికారులు స్పందించి సాగి చెరువు హద్దులను నిర్ణయించి చెరువులను కాపాడాలని కోరుతున్నారు.

అసైన్డ్ లోనూ భారీ మతలబు...

శ్రీ రంగపురం సాయి చెరువు అంచున కోట్ల రూపాయల విలువచేసే అసైన్డ్, భూదాన భూములు ఉన్నాయి. వీటి కేటాయింపులు భారీ మతలబు జరిగినట్టు తెలుస్తుంది. చెరువు సమీపంలో సర్వేనెంబర్ 753 లో రెండు ఎకరాల 10 గుంటలు 758 లో 22 కుంటల అసైన్డ్ భూములు ఉన్నాయి. వీటిని కొందరు వ్యక్తులు దొడ్డి దారిన దక్కించుకున్నారు. ఒకటికి రెండుసార్లు అసైన్డ్ భూమిని కేటాయించడం కూడా ప్రస్తుతం వివాదంగా మారింది అదేవిధంగా మరో ప్రభుత్వ ఉద్యోగి తన భార్య పేరు మీద ఇక్కడ అసైన్డ్ భూమిని కాజేశారని తెలుస్తుంది. ఇక ఇక్కడ చెరువు మునకలో నాలుగు ఎకరాలు షేక్ సింద్ లకు ఎక్ సాల్ పట్టాలిచ్చారు. అంటే చెరువు నీరు లేనప్పుడు వారు దీన్ని సాగు చేసుకోవాలి. అదేవిధంగా సర్వేనెంబర్ 758 లో ఎకరం 38 గుంటల భూదాన్ ఉంది. దీనిని నడిగూడెంకు చెందిన స్వాతంత్ర సమరయోధుడికి కేటాయించారు. కానీ ఈ కేటాయింపు సక్రమంగా లేదని కొందరు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో అది ఐదేళ్లుగా వివాదంలోనే ఉంది. ప్రస్తుతం అసైన్డ్ ఎక్సెల్ పట్టా భూములు భూదాన్ భూములు కలిపి దాదాపు 8 ఎకరాల గుంటలు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయి. అధికారులు పట్టా భూమిగా రికార్డుల నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రికార్డులు ఎక్కడ దొరకడం లేదు...

ఇన్ చార్జి తహశీల్దార్ సోమపంగు సూరయ్య

శ్రీరంగాపురం సాగి చెరువు విషయం మా దృష్టికి వచ్చింది. పలువురు దీనిపై ఫిర్యాదు చేయడంతో రికార్డులు పరిశీలించాం. ఎవరి వద్ద అయినా వివరాలు ఉంటే మాకు ఇస్తే పరిశీలిస్తాం. అసైన్డ్ భూములు ఎక్స్ఎల్ పట్టా ఉన్నది భూదాన్ భూములు కూడా ఉన్నాయి. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం

Advertisement

Next Story

Most Viewed