నల్గొండ డీసీసీబీ చైర్మన్ గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

by Kalyani |
నల్గొండ డీసీసీబీ చైర్మన్ గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
X

దిశ,నల్గొండ: డీసీసీబీ అవిశ్వాస నెగ్గిన కాంగ్రెస్ శ్రేణులు నేడు ఎన్నిక జరిగిన నేపథ్యంలో నల్గొండ డీసీసీబీ చైర్మన్ గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. చైర్మన్ పోటీకి ఒక్క నామినేషన్ రావడం తో ఏకగ్రీవం అయినట్లు అధికారికంగా డిసిఓ కిరణ్ కుమార్ ప్రకటించారు. 15 మంది డైరెక్టర్లు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని కేంద్ర సహకారంతో కార్యాలయంలో నల్గొండ జిల్లా నూతన డిసిసిబి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుంభం శ్రీనివాస్ రెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.మంత్రి మాట్లాడుతూ రైతు రాజ్యం స్థాపించడమే తమ లక్ష్యమని అన్నారు.నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షునిగా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పట్ల మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.డిసిసిబి అధ్యక్షుడిగా కుంభం శ్రీనివాస్ రెడ్డికి రైతులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని,

నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులతో పాటు, అన్ని రకాల పంటలు పండించే రైతులకు సేవ చేయవచ్చని,నల్గొండ డిసిసిబి చైర్మన్ కి అందరి సహకారం ఉంటుందని తెలిపారు. పదవి ముఖ్యం కాదని, రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, డిసిసిబి ద్వారా గతంలో వెయ్యికోట్ల విద్యా రుణాలు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు దాన్ని అధిగమించి రుణాలివ్వాలని సూచించారు. ప్రస్తుతం 25 కోట్ల రూపాయల టర్నోవర్ తో బ్యాంకు ముందుకు సాగుతుందని, దానిని 300 కోట్లకు తీసుకెళ్లాలన్నారు.

ఆగస్టు 15 నుంచి రైతులకు రెండు లక్షల రుణమాఫీకి సీఎం ఆదేశించారని, రాష్ట్రంలో 30 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయనున్నామని, గతంలో తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 70 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పు బకాయిలు ఉన్నప్పటికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని, తెలంగాణ రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని,వచ్చే నాలుగున్నరేళ్లలో రైతులకు అండగా ఉంటామని అన్నారు.

రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని నూతన డిసిసిబి అధ్యక్ష్యులు కుంభం శ్రీనివాస రెడ్డి అన్నారు. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతామని, రోడ్లు భవనాలు, నీటిపారుదల శాఖల మంత్రుల అందరి సహకారంతో జిల్లాలోని రైతులకు సేవలందిస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ అధ్యక్షులు బొల్ల వెంకట్రెడ్డి, బీసీసీబీ సీఈవో శంకర్రావు, డిసిసిబి ఎన్నికల నిర్వహకులు, డిసిఒ కిరణ్ కుమార్, తదితరులు ఉన్నారు.

Next Story