- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జవాన్ కోసం వెల్లువెత్తిన ప్రార్థనలు
దిశ, రామన్నపేట: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల వద్ద మంగళవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తరలించారు. కాగా, ఎన్‌కౌంటర్‌లో మావోల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతుల్లో మహాదేవపూర్-ఏటూరునాగారం దళకమాండర్ సుధాకర్ ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
అయితే, ఈ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డ జవాన్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామం. 2015లో కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయిన మధు గ్రేహౌండ్స్ బలగాల్లో చేరాడు. చిన్నప్పటినుంచే పోలీసు ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదలతో డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయినట్టు సమాచారం. అంతేగాక, తన తమ్ముడు మహేశ్‌ని కూడా 2019లో పోలీస్ శాఖ విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఉద్యోగం సంపాదించేలా ప్రొత్సాహించి, ఉద్యోగం వచ్చాక గ్రేహౌండ్స్ బలగాల్లో చేర్చాడు. కాగా, ఇటీవల గ్రామానికి వచ్చిన జవాన్ మధు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి తన ఉద్యోగ అనుభవాలు పంచుకున్నట్లు తన మిత్రుడు మేడి మల్లేష్ తెలిపారు. తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల కాలు విరగడంతో ఇంటివద్దనే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు.
మంగళవారం రాష్ట్ర సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ విషయం గ్రామంలో తెలియడంతో కుటుంబసభ్యులతో గ్రామస్తులు టెన్షన్‌లో ఉన్నారు. ప్రాణాలకు తెగించి మావోయిస్టులతో పోరాడినందుకు గర్వంగానూ ఉన్నారు. ''గెట్ వెల్ సూన్ జవాన్ మధు'' అంటూ వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం మధు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.