శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి : జానారెడ్డి

by Vinod kumar |   ( Updated:2023-11-30 03:01:32.0  )
శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి : జానారెడ్డి
X

దిశ, నాగార్జునసాగర్: నాగార్జున సాగర్ డ్యాంపై బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీకి చెందిన పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులు దౌర్జన్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. నీటి సమస్య ఉంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకుని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్ర పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం పై విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులపై దాడి చేయడం సరైనది కాదని.. కృష్ణ రివర్ బోర్డ్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలని కోరారు.

Advertisement

Next Story