గిరిజన రైతుల జీవనోపాధి మెరుగునకు సమీకృత వ్యవసాయం

by Naveena |
గిరిజన రైతుల జీవనోపాధి మెరుగునకు సమీకృత వ్యవసాయం
X

దిశ, గరిడేపల్లి : సమీకృత వ్యవసాయం విధానాలు పాటించడంతో..గిరిజన రైతుల జీవనోపాధి మెరుగు పడుతుందని కేవీకె సీనియర్ సైంటిస్ట్, ఇన్చార్జి డి.నరేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ట్రైబల్ సబ్-ప్లాన్ (గిరిజన ఉప-ప్రణాళిక) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన గిరిజన రైతులకు జీవన ఎరువులను పంపిణీ చేశారు. కేవికే సీనియర్ సైంటిస్ట్ ,ఇన్చార్జి డి.నరేష్ మాట్లాడుతూ..గిరిజన ఉప ప్రణాళిక కింద నిర్వహించే కార్యక్రమల గురించి రైతులకు వివరిస్తూ సేంద్రియ వ్యవసాయ విధానాలు, జీవన ఎరువులు ఉపయోగించడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా అజోస్పరిల్లం, ఫొస్ఫో బ్యాక్టీరియా, పొటాషియం బ్యాక్టీరియా, జీవ శీలింద్రనాసులైన ట్రైకోడెర్మా, సుడోమొనాస్ ల వంటి జీవన ఎరువులను 50 మంది రైతులకు రెండు కేజీల చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేవికే శాస్త్రవేత్తలు ఎ.కిరణ్, టి. మాధురి, ఎన్.సుగంధి, గిరిజన రైతులు పానుగోతు రవి, గుగులోతు సురేష్, భానోత్ శ్రీరాములు, లావూరి మంద్యి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story