అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

by Naveena |
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
X

దిశ ,నకిరేకల్ : అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నమునాకు నకిరేకల్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి అన్నారు. ప్రతిపక్ష నాయకులు అవకాశం ఇచ్చినప్పుడు అభివృద్ధి చేయకూడదు రాద్ధాంతాలు చేయడం మానుకోవాలన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకొని నాశనం చేశారన్నారు. రాబోయే రోజుల్లో నకిరేకల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానన్నారు. ఇప్పటికే ఉదయ సముద్రం ప్రారంభం ,,ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాల్వలకు నిధులు మంజూరు చేయించిన విషయాన్ని పునరుద్గాటించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత పది ఏళ్లలో అర్హులకు రేషన్ కార్డు అందలేదని, త్వరలో రేషన్ కార్డులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, నకిరేకంటి నరేందర్, వీరా అర్జున్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story