మీ గుండె ఆరోగ్యంగానే ఉందా..? ఈ సంకేతాలతో గుర్తించండి..?

by Anjali |
మీ గుండె ఆరోగ్యంగానే ఉందా..? ఈ సంకేతాలతో గుర్తించండి..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన బాడీలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో గుండె(heart) ఒకటి. శరీరంలోని ప్రతి పార్ట్‌కు బ్లడ్ సర్కులేషన్(Blood circulation) చేసేందుకు పనిచేస్తుంది. ముఖ్యంగా హార్ట్ ఆరోగ్యం బాగుంటేను మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు(Heart diseases), హైబీపీ(High BP) వంటి సమస్యలతో జనాలు బాధపడుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉందా? లేదా? అని తెలుసుకోవాలంటే మీ శరీరంలోనే కొన్ని లక్షణాల్ని గుర్తించాలి అంటున్నారు నిపుణులు. దీంతో గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉండదని చెబుతున్నారు.

నిపుణులు అభిప్రాయం ప్రకారం హార్ట్ హెల్తీగా ఉందో లేదో తెలుసుకునే ఈ లక్షణాల్ని ఇప్పుడు చూద్దాం.. ముందుగా హృదయ స్పందన రేటు(heart rate) ఆరోగ్యకరమైన హార్ట్ కు సంకేతం. కాగా గుండె నిమిషానికి 60 నుంచి 100 మధ్య కొట్టుకుంటుందో లేదో చెక్ చేసుకోవాలి. గుండె ఆరోగ్యానికి హైబీ కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు.

బీపీ నిరంతరం ఎక్కువగా ఉంటే గుండె ఆరోగ్యానికి చేటు. కాగా 120/80 ఉండేలా చూసుకోవాలి. అలాగే అధిక బరువు(overweight) కూడా గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతుంది. చిన్న చిన్న పనులకే అలసిపోవడం(getting tired), తల తిరగడం(Dizziness) కూడా గుండె బలహీనత(Heart failure)కు సంకేతం అవుతుంది. వీటితో పాటు నిరాశ(disappointment), ఆందోళన(worry), మానసిక ఒత్తిడి (mental stress)మీ హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. గుండె సంబంధిత ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed