- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది
దిశ హుజుర్ నగర్ / మఠంపల్లి: జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో మెజార్టీ స్థానాలు గెలిచి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి నల్గొండ పార్లమెంటరీ ఎన్నికల ఇంచార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 30న నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశాన్ని మట్టపల్లి మండలంలోని మట్టపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. సందర్భంగా జరగబోయే సమావేశానికి సంబంధించిన పనుల పరిశీలనను ఆయన పరిశీలించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయే బీజేపీ పార్టీ కి ఓటు వేసి ప్రజలు తమ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక సీటు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి మూడు లక్షల మెజారిటీ సాధించిందన్నారు. నల్లగొండ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడమే కాకుండా అత్యధిక మెజారిటీ వస్తుందని ఆశించారు.
సుదీర్ఘమైన కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు అభిమానులు కాపాడుకుంటూ వస్తున్నారని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అన్నారు. అంతకుముందు మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ధర్మకర్తలు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమావేశంలో సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఐఎన్‌టీసీ రాష్ట్ర నాయకులు ఎర్రగాని నాగన్న గౌడ్ హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ ఎంపీపీలు గూడెపు శ్రీనివాస్ భూక్య గోపాల్ మఠంపల్లి పాలకవీడు మండల అధ్యక్షులు మంజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.