- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్ !
దిశ, దేవరకొండ : రైతుల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని దేవరకొండ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను కొనుగోలు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2060 రూపాయలకు, కామన్ గ్రేడ్ ధాన్యానికి రూ. 2040 రూపాయలు మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. అంతేకాకుండా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన రైతులకు సూచించారు. ప్రతి ధాన్యం గింజలు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు సహకరించక పోయిన రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, స్థానిక సర్పంచ్ మునుకుంట్ల విద్యావతి వెంకటరెడ్డి, మారుపాకుల సురేష్ గౌడ్, కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కడారి తిరుపతయ్య, నేనావత్ కళ్యాణ్, దస్రు నాయక్, పగిళ్ల చంద్రయ్య, ఎర్ర విజయ్, దినకర్, కడారి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.