- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రారంభించారు కాంటాలు మరిచారు..
దిశ, పెన్ పహాడ్ : మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాలమేరకు డీఆర్డీఎ, సెర్ప్ ద్వారా 6 కొనుగోలు కేంద్రాలు, పీఎసీఎస్ ద్వారా 2 కొనుగోలు కేంద్రాలతో పాటు 6 సబ్ సెంటర్లు కూడా ప్రారంభించారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభించడం మరిచారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు కాంటాలు మొదలు పెట్టకపోవడంతో ఎదురుచూస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో శుక్రవారం రాత్రి 8:30 గంటలకు వరకు మంచిగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా నిమిషాలలో వ్యవదిలోనే ఉరుములు మెరుపులతో దట్టమైన మబ్బులు కమ్మి ఈదూరు గాలులతో, కూడిన అకాల వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసిపోయింది. అయితే చిమ్మ చీకట్లోనే రైతులంతా తమ పంటను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
పెన్ పహాడ్ మండలంలోని వివిధ ప్రాంతాలలో రాత్రి పొద్దుపోయేంతవరకు నెలకొన్న పరిస్థితి. కొన్ని కేంద్రాలలో వివిధ కారణాలతో తూకాలు ప్రారంభం కాలేదు. అయితే ఇప్పటికే కేంద్రాలకు భారీ ఎత్తున ధాన్యం చేరింది. చివరికి రాత్రి కురిసిన భారీ వర్షంతో పంటంతా తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాలలో రైతులకు, నిర్వాహకులు టార్బలిన్ పట్టాల సౌకర్యం కల్పించక పోవడం వల్ల రైతుల ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దింతో నిర్వాహకులు కూడా చేతులెత్తేశారు. అయితే కొంతమంది రైతులు వర్షంలో తడుస్తూ తమతమ ఇండ్లలో నుండి పట్టాలను కొనుగోలు కేంద్రాల తీసుకెళ్లి కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా బలమైన ఈదురు గాలుల వల్ల ధాన్యం రాశులపై కొంతవరకు కప్పిన పట్టాలు కూడా లేచిపోయాయి. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో త్వరగా కాంటాలను ప్రారంభించాలని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.